Andhra Pradesh Road Transport Corporation Employees Provident Fund Trust
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్టు
భవిష్య నిధి (Provident Fund) సమాచారం
ఉద్యోగి పదవిలోనూ పదవీ విరమణ అనంతరం పొందు ఆర్థిక ప్రయోజనాలు
భవిష్య నిధి కి గాను పే + డి.ఎ పై 12% ఉద్యోగి చందాగాను, అంతే మొత్తం యాజమాన్యం నుండి జమ చేయబడుతుంది
యాజమాన్యం సభ్యునికై జమ చేసిన మొత్తము నుండి 8.33% పింఛను నిధి కి బదిలీ చేయబడుతుంది
భవిష్య నిధికి జమ చేసిన మొత్తము పై ప్రస్తుతం నిబంధనల ప్రకారం 8.75% వడ్డీ ఇవ్వబడుతుంది
ఉద్యోగి తన చెల్లింపు అదనంగా స్వచ్ఛంద (వాలంటరీ) పి.ఎఫ్ గా పొందవచ్చు. దీనికి యాజమాన్య చెల్లింపు ఉండదు. దీనిపై ప్రస్తుతం నిబంధనల ప్రకారం 8.75% వడ్డీ ఇవ్వబడుతుంది.
వివాహము, ఉన్నత విద్య, ఆరోగ్యం, స్థలం కొనుగోలు, గృహ నిర్మాణం నిమిత్తము ఉద్యోగి ఖాతా నుండి నిబంధనలను అనుసరించి అర్హమైన మొత్తము పొందవచ్చును.
గమనిక : ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన వెంటనే తప్పక నామినేషన్ ఫామ్ ఇవ్వవలెను. ఈ నామినేషన్ ఇ.డి.ఎల్.ఐ.ఎఫ్ కు మరియు ఇ.పి.ఎఫ్ కు కూడా వర్తిస్తుంది
ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో పి.యఫ్, ఇ.పి.ఎస్ క్లెయిమ్లు 3౦ రోజుల ముందుగా మరియు మరణించిన సందర్భంలో పి.యఫ్, ఇ.పి.ఎస్, ఇ.డి.యల్.ఐ.ఎఫ్ క్లెయిమ్ లు 30౦ రోజులలోపు ఒకేసారి పంపవలెను.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.