ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా స౦స్థ ఉద్యోగుల భవిష్యనిధి ట్రీస్తు
ఇడి.యల్.ఐ.ఎఫ్. (EDLIF) ప్రయోజనాలు
ఇ.డి.యల్.ఐ.ఎఫ్. ద్వారా 01-09-2014, తర్వాత సర్వీసులో ఉండి చనిపోయిన సభ్యుని యొక్కనామినేషన్ ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు వచ్చు సవరించబడిన ఆర్థిక ప్రయోజనం క్రింద విధంగా ఉన్నది
1. కనీస మొత్తము Rs.35000/-
2. (ఎ) సభ్యుని మరణానికి ముందు భవిష్యనిధిలోని 12 నెలల సరాసరి నిల్వ రూ. 50,000/-లు గాని, దానికి తక్కువగాని ఉన్నప్పుడు, ఆ సరాసరి నిల్వ మొత్తము యధావిధిగా ఇవ్వబడును. సరాసరి నిల్వ రూ. 50,000/-లు కంటె ఎక్కువ ఉన్నచో రూ. 50,000/- + Rs.50,000/-ల కన్నా మించిన మొత్తముపై 40% ఇవ్వబడును. దీని గరిష్ట పరిమితి /-లేదా
(బి) సభ్యునిపే + డి.ఎ రూ. 15000/- పరిమితికి లోబడి, పింఛను ఆప్షన్‌తో నిమిత్తము లేకుండా సభ్యుని మరణానికి ముందు 12 నెలల
సరాసరిపే + డి.ఎ x 20(పే + డిఎకి 20 రెట్లు) గరిష్ట పరిమితి Rs.3,00,000/- గా ఇవ్వబడును.
పై ఎ,బి, ఆంశములలో, ఏ మొత్తము ఎక్కువ అయితే ఆ మొత్తమునకు అదనముగా 20%, అనగా గరిష్టముగా రూ.3,60,000/- ఇవ్వబడును
3. అర్హమైన ప్రతి మొత్తమునకు అదనముగా రూ. 100/- ఇవ్వబడును
ఇ.డి.యల్.ఐ.ఎఫ్. పొందుటకు అవసరమైన పత్రాలు
మరణ ధృవీకరణ పత్రము
ఉద్యోగి ఇచ్చిన పి.యఫ్ నామినేషన్ కాపీ
ఉద్యోగి మరణానంతరము యాజమాన్యం వెలువరించిన దెత్‌నోటి ఫికేషన్
నామిని బ్యాంకు ఖాతా మొదటి పేజి కాపీ
పూర్తిగా నింపబడిన నామినీ ఇ ఇచ్చే క్లెయిమ్ ఫారం
పై పత్రములు అన్నింటిపై సంబంధిత యూనిట్ ఆఫీసర్ / డిపో మేనేజర్ స్టాంపు తో కూడిన సంతకం ఉండవలెను
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.